థార్ రాక్స్ ఫోర్ వీల్ డ్రైవ్ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసిన మహీంద్రా... ధరల వివరాలు

  • మహీంద్రా థార్ రాక్స్ 4x4 ధరలు రివీల్
  • వేరియంట్ల వారీగా ధరలు వెల్లడించిన మహీంద్రా
  • ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.18.79 లక్షలు
థార్ రాక్స్ పేరుతో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల థార్ రాక్స్ వెహికల్ ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ సమయంలో కేవలం రేర్ వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్యుడీ) ధరలు మాత్రమే వెల్లడించింది. కాగా, ప్రస్తుతం మహీంద్రా థార్ రాక్స్ 4 X 4 వేరియంట్ ల ధరలను వెల్లడించింది. దీని ట్రిమ్స్ ప్రారంభ ధర రూ.18.79 లక్షల (ఎక్స్ షోరూం) వద్ద ప్రారంభమవుతుంది. 4 X 4 కాన్ఫిగరేషన్ లో కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మ్యాన్యువల్ గేర్ బాక్స్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ 152 హెచ్ పీ మరియు 330 ఎన్ఎం పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ 370 ఎన్ఎం టార్క్, 175 హెచ్ పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 

మహీంద్రా థార్ ROXX 4x4 వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్ షోరూం)
మహీంద్రా థార్ రోక్స్  MX5 MT – రూ.18.79 లక్షలు
మహీంద్రా థార్ రోక్స్  AX5L AT  - రూ.20.99 లక్షలు
మహీంద్రా థార్ రోక్స్  AX7L MT – రూ.20.99 లక్షలు
మహీంద్రా థార్ రోక్స్  AX7L AT -  రూ.22.49 లక్షలు

mahindra thar roxx
Business News

More Telugu News